అరవయ్యో ఏట వివాహబంధం

అరవయ్యో ఏట వివాహబంధం

న్యూ ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ (60) తన స్నేహితురాలు రవీనా ఖురానాను ఆదివారం ఇక్కడ వివాహం చేసుకున్నారు. ఇక్కడి ఒక హోటల్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో కొందరు అతిథుల మధ్య ఒక్కటయ్యారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్ తదితరులు వధూ వరులను ఆశీర్వదించారు. ‘మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నందుకు అభినందనలు. రాబోయే రోజులు మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటున్నాను’ అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. ‘ముకుల్ వాస్నిక్, రవీనా ఖురానా పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను 1984లో ముకుల్ను, 1985లో రవీనాను మొదటిసారిగా కలిశాను. వారిద్దరు పెళ్లి చేసుకోవడం సంతోషించదగ్గ విషయం. మేమంతా కలిసి గతంలో మాస్కోలో జరిగిన వరల్డ్ యూత్ స్టూడెంట్స్ ఫెస్టివల్కు హాజరయ్యామంటూ’ మాజీ మంత్రి మనీష్ తివారీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos