ముఫ్తీ నిర్బంధంపై ప్రభుత్వానికి నోటీసులు

ముఫ్తీ నిర్బంధంపై  ప్రభుత్వానికి నోటీసులు

న్యూఢిల్లీ:పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం గురించి వివరించాలని జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వానికి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం బుధవారం తాఖీదుల్ని జారీ చేసింది. ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద కేసు నమోదు చేయడాన్ని ఆమె కుమార్తె ఇల్తిజా జావెద్ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఆమె దాఖలు చేసిన వ్యాజ్యా న్ని విచా రించిన న్యాయంస్థానం తాఖీదుల్ని జారీ చేసింది.కుట్ర పూరితంగా తన తల్లిని నిర్బంధించారని ఇల్తిజా పేర్కొన్నారు. ముఫ్తీపై పీఎస్ఏ విధించ డానికి ప్రభుత్వం చూపుతున్న కారణాలు కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. పచ్చ రంగులో ఉన్న పార్టీ జెండా, తండ్రి అడుగు జాడల్లో డవడం,సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లను కారణంగా చూపారని తెలిపారు. జమ్ము-కశ్మీర్కు కేంద్రం స్వయం ప్రతి పత్తిని తొలిగించిన తర్వాత మెహబూబాను గృహంలో నిర్బంధించారు.గడవు ఈ నెల ఐదున ముగియటంతో ఆమెపై పీఎస్ఏ ప్రయోగించారు. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా మరో మూడు నెలల నుంచి ఏడాది వరకు నిర్బంధించ వచ్చు.తన తల్లి నిర్బంధాన్ని సవాల్ చేస్తూ మరే కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయకూడదని ఇల్తిజా నుంచి న్యాయస్థానం ప్రమాణ పత్రాన్ని కోరింది.తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos