3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు

3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు

న్యూఢిల్లీ:‘భారత్తో మూడు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి.భారత్లో తన పర్యటన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చి పోలేన’ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.ఇక్కడి హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ, ట్రంప్ విలేఖరులతో మాట్లా డారు.‘ఈ పర్యటన ఎంతో ప్రత్యేకమైంది. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను.రెండు దేశాలకు ఇది ఫలప్రదనమైన పర్యటన. ఉభయ కులకూ మేలు కలిగే ఒప్పందాలపై అవగాహనకు వచ్చాం. ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి రెండు దేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై మాట్లాడాం. 5జీ వైర్లెస్ నెట్వర్క్పై చర్చించాం.3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ద్వై పాక్షిక ఆర్థిక సంబంధాలపై ప్రధానంగా చర్చించాం. పరస్పర ప్రయోజనాలను కాపాడుకునేలా పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించాం.భారత్కు భారీ మొత్తంలో ఎల్ఎన్జీ ఎగుమతులు చేసేందుకు అవగాహన కుదిరింది’ అని ట్రంప్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos