మో, షాల మధ్య భేదాభిప్రాయాలు

మో, షాల మధ్య భేదాభిప్రాయాలు

రాయ్పూర్ : నూతన పౌరసత్వ చట్టం అమలు గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా మధ్య భేదాభిప్రాయాలు వచ్చా యని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ శనివారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ఈ భేదాభిప్రాయాలకు దేశం భారీ మూల్యాన్ని చెల్లి స్తోందన్నారు. ‘పౌరసత్వ చట్ట సవరణ , జాతీయ జనాభా పట్టిక, ఎన్నార్సీలు అంతర్భాగాలని షా అన్నారు. ప్రధాని మోదీ న్నార్సీని అమలు చేయబోమన్నారు. అంటే ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు? ఎవరు అబద్ధాలాడుతున్నారు? ఇది చూస్తుంటే వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు స్పష్టమవుతోంది. అందుకు దేశం తగిన మూల్యం చెల్లిస్తోంద’ని మండి పడ్డారు. మతాల పేరిట దేశ ప్రజలను కేంద్రం విభజిస్తోందని దుయ్యబట్టారు. మొదటి ఐదేళ్లలో మోదీ నోట్ల రద్దు, జీఎస్టీని అమ లు  చేయగా, కశ్మీర్కు 370 అధీకరణ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ లాంటి వాటిని అమిత్షా తీసుకొచ్చారన్నారు. దే శం లోని పేదలు ఎన్నార్సీకి అవసరమైన ఆధారాలను ఎలా ఇస్తారని, కేంద్రం ఆలోచించాలని భూపేశ్ భాగేల్ సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos