వర్షాకాలంలో ఈ బీచ్‌లకు ఒక్కసారైనా వెళ్లాల్సిందే..

వర్షాకాలంలో ఈ బీచ్‌లకు ఒక్కసారైనా వెళ్లాల్సిందే..

వేసవి కాలం వచ్చిందంటే చాలు బ్రహ్మచారులు,కుటుంబాలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం అత్యంత సహజమైన విషయమే. ఊటీ, కూర్గ్‌,షిమ్లా, అరకు తదితర హిల్స్‌ స్టేషన్లకు వెళుతుంటారు.మరి కొంతమంది శీతాకాలంలో పర్యాటక ప్రాంతాలకు వెళుతుంటారు.అయితే వేసవికాలం,శీతాకాలం మాత్రమే కాకుండా వర్షాకాలంలో కూడా సరదగా చుట్టిరావడానికి కొన్ని ప్రదేశాలు అనువుగా ఉంటాయి.అందమైన పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరైన కొన్నిసముద్ర తీరాలు వర్షాకాలంలో రారమ్మని ఆహ్వానిస్తుంటాయి.చిరు జుల్లులు మధ్య అప్పుడప్పుడు సన్నని సూర్యకిరణాలు.. చల్లగానునుపుగా.. సముద్రతీరంలోని వెండి వెన్నెలలాంటి నురుగుతో.. బంగారం వర్ణం ఇసుకను తాకుతూ కాళ్ళకు సుతిమెత్తంగా తాకుతుంటే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది.మరి రొమాంటి బీచ్ గురించి ఓ చూపేయండి కుదిరితే స్నేహితులతోనే లేదా కుటుంబంతోనే సరదాగా చుట్టిరండి..

వెల్నేశ్వర్ బీచ్ :
పచ్చదనంతో నిండిపోయిన ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించాలంటే వెల్నేశ్వర్‌ బీచ్‌కు వెళ్లి తీరాల్సిందే.సముద్ర తీరం పొడవునా ఉండే కొబ్బరి చెట్లు,సముద్ర అలల సందడితో ఏమాత్రం అపరిశుభ్రత కనిపించని ఈ బీచ్‌లో స్విమ్మింగ్‌,సన్‌ బాతింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.నెలవంక ఆకారంలో ఉన్నఈ బీచ్లో పొడవైన కొబ్బరి తోటలను చూడటం వల్ల మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది.మహారాష్ట్ర రాష్ట్రంలోని వెల్నేశ్వర్‌ బీచ్‌కు చేరుకోవడానికి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ రవాణ సంస్థ బస్సు సర్వీసులను నడుపుతోంది.ముంబయి నగరం నుంచి 302 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్నేశ్వర్‌ బీచ్‌కు బస్సుల్లో చేరుకోవచ్చు.ముంబయితో పాటు రత్నగిరి,పూణెల నుంచి వెల్నేశ్వర్‌ బీచ్‌కు చేరుకోవచ్చు.రైలు మార్గంలో వెల్నేశ్వర్‌ బీచ్‌కు చేరుకోవాలంటే వెల్నేశ్వర్‌ బీచ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోనున్న చిప్లన్‌ స్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో వెల్నేశ్వర్‌కు చేరుకోవచ్చు.బెంగళూరు నుంచి వెల్నేశ్వర్‌కు వెళ్లాలంటే రత్నగిరికి చేరుకొని అక్కడి నుంచి వెల్నేశ్వర్‌కు చేరుకోవచ్చు..

వెల్నేశ్వర్‌ బీచ్‌..

సెయింట్ మేరీస్ ఐలాండ్ :
కర్ణాటక రాష్ట్రంలోని మల్పే సముద్ర తీరానికి సమీపంలో ఉండే సేయింట్‌ మేరీస్‌ ఐల్యాండ్‌ను
కోకోనట్ ఐలాండ్ మరియు తాన్సేపార్ ఐలాండ్ అనికూడా పిలుస్తారు.క్రీ.శ1498లో వాస్కోడిగామ కనుగొన్న ఈ ఐల్యాండ్‌ నాలుగు ద్వీపాల సమూహంగా ఉంటుంది.లావా వెలువడడం వల్ల ఈ ఐల్యాండ్‌ ఏర్పడిందని చెప్పబడే ఈ ఐల్యాండ్‌ జియో టూరిజంకు ప్రసిద్ధి చెందింది.300మీ పొడవు, 100మీ వెడల్పుతో ఉంటే ఈ ఐల్యాండ్‌ ఉప్పు తయారీకి కూడా ప్రసిద్ది చెందింది.బెంగళూరు నుంచి బస్సు లేదా రైలు మార్గం ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో ఉన్న ఈ ఐల్యాండ్‌ను చేరుకోవచ్చు..

మేరీ ఐల్యాండ్‌ బీచ్‌..

రాధానగర్ బీచ్ :
ఇక పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న రాధానగర్ బీచ్ ను 7 బీచ్ అని పిలుస్తారు. హ్యావ్లాక్ ద్వీపంలో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ద్వీపాల్లో దీనిదే మొదటిస్థానం. ఆసియాలో అత్యుత్తమ బీచ్ లో ఒకటిగా 2004లో బీచ్ ఎంపికయ్యింది.అంతేకాకుండా ద్వీపానికి వాయువ్య ప్రాంతంలో ఉన్న ఎలిఫెంటా బీచ్, తూర్పు భాగంలో ఉన్న విజయనగర బీచ్ దీనిని బీచ్ నంబర్ 5 అని కూడా పిలుస్తారు. అదే విధంగా బీచ్ నంబర్ 3, బీచ్ నం 1 లు కూడా అత్యంత ప్రజాధరణ పొందాయి.లక్ష్వదీప్‌లోనున్న హ్యావ్లాక్‌ బీచ్‌కు చేరుకోవాలంటే ముందుగా పోర్టు బ్లెయిర్‌ వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఫెర్రీలు లేదా ప్రైవేటు నౌకల్లో హ్యావ్లాక్‌ బీచ్‌కు చేరుకోవచ్చు..

రాధా నగర్‌ బీచ్‌..

అంజర్లే బీచ్:
తీరం పొడవునా తెల్లని ఇసుకతో కప్పబడి ఆహ్లాదకరంగా కనిపించే అంజర్లే బీచ్‌లో డాల్ఫిన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.దీంతోపాటు ప్యారాసైలింగ్‌,స్నోర్కెలింగ్‌,వైండ్‌ సర్ఫింగ్‌ క్రీడలు బీచ్‌కు చాలా అనుకూలం.అన్నిటికంటే ముఖ్యంగా ఈ బీచ్‌లో లభించే సముద్ర ఆహారం(సీఫుడ్‌)అత్యంత అద్భుతంగా ఉంటుంది.మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో ఉన్న అంజర్లే బీచ్‌కు చేరుకోవడం కొంచెం సులువే.బస్సు లేదా రైలు మార్గంలో నేరుగా రత్నగిరికి చేరుకొని అక్కడి నుంచి డపోలి పట్టణానికి చేరుకోవాలి.అక్కడి నుంచి ప్రభుత్వ లేదా ప్రైవేటు వాహనాల్లో అంజర్లే బీచ్‌కు చేరుకోవచ్చు.బీచ్‌లోని కొండపై ఉన్న కడ్యావర్చ గణపతి దేవాలయం,జోగ్‌ నది కూడా చూడదగిన ప్రాంతాలు..

అంజర్లే బీచ్‌..

వర్కలా బీచ్:
ప్రశాంతతకు నిలయంగా ఉండే వర్కలా బీచ్‌ కుటుంబ సమేతంగా వెళ్లడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ సహజసిద్దంగా వీచే గాలిలో ఔషధ గుణాలు మరియు నివారణ లక్షణాలు ఉన్నాయి. బీచ్ లో మునగడం వల్ల శారీరక రుగ్మతలు తొలగిపోయి, ఆత్మ ప్రక్షాళన చేస్తుందని ఎక్కువ మంది విశ్వసిస్తారు.అదేవిధంగా రెండువేల సంవత్సరాల నాటి విష్ణు దేవాలయం,శివగిరి మఠం చూడదగ్గ ప్రదేశాలు.సన్ బాత్ మరియు స్వమ్మింగ్ సౌకర్యం ఉంది.అనేక ఆయుర్వేద మసాజ్ కేంద్రాలతో వర్కలా బీచ్‌ ప్రసిద్ధ ఆరోగ్య రిసార్ట్ గా మారుతోంది.కేరళ రాష్ట్రంలోని తిరువనంతపుర సమీపంలోనే వర్కలా బీచ్‌ ఉంది.రైలు,బస్సు,విమాన మార్గం ద్వారా కూడా తిరువనంతపురం చేరుకొని పట్టణానికి సమీపంలోని వర్కలా బీచ్‌ అందాలు ఆస్వాదించవచ్చు.వర్కలా బీచ్‌లో సూర్యాస్తమయం అత్యంత అద్భుతంగా ఉంటుంది..

వర్కలా బీచ్‌..

మరావంతే బీచ్:
ప్రశాంత జీవనం కోరేవారి స్వర్గం బీచ్ ను తరచుగా వర్జిన్ బీచ్ లేదా కన్యత్వ బీచ్ అంటారు. దానికి కారణం బీచ్ మైళ్ళ పొడవున మాత్రం పాడవకుండా తెల్లటి ఇసుకతో పరచబడి ఉంటుంది. పర్యాటకులు ఎంతో ఇష్టపడే బీచ్ కొల్లూరు మరియు కొడచాద్రి కొండలకు సమీపంలో ఉంది. ఇక్కడినుండి జాతీయ రహదారి షుమారు 100 మీటర్ల దూరం మాత్రమే. కనుక మీరు బీచ్ సందర్శించటం ఎంతో మరవంతే బీచ్ ఉడుపి పట్టణానికి 55 కి.మీ. దూరంలో ఉంది. అందమైన బీచ్ ఇది. కంచుగోడు గ్రామం వద్దగల ప్రదేశంలో స్కూబా డైవింగ్, స్నోర్ కెలింగి వంటి ఆటలు ఆడవచ్చు. బీచ్ లో స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. బీచ్ సమీపంలోగల సౌపర్ణిక నది ఒడ్డునకల దేవాలయాన్ని సందర్శించవచ్చు. కొడచారి హిల్స్ మరియు అందమైన కొబ్బరి తోటలు దాని వెనుక కనపడే బీచ్ వంటివి పర్యాటకులకు కన్నుల విందు చేస్తాయి.కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నగరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో మరావంతె బీచ్‌ ఉంది.బెంగళూరు నుంచి రోడ్డు,రైలు,విమాన మార్గాల ద్వారా మంగళూరుకు చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా మరావంతె పట్టణానికి చేరుకుంటే మరావంతె బీచ్‌కు చేరుకున్నట్లే..

మరావంతే బీచ్‌..

ప్రొమెనేడ్ బీచ్ :
మీ ప్రియమైన వారితో ఆహ్లాదంగా గడపడానికి మరియు ప్రశాంత వాతావరణంలో గడపాలంటే ప్రోమెనేడ్ బీచ్ కు వెళ్ళాల్సిందే. బీచ్ సాయంత్రం విహారానికి అంద్భుతంగా ఉంటుంది. సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలి నడకన నడుస్తూ ఉంటే మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది. బీచ్ పాండిచ్ఛేరికి 1.2కిలోమీటర్ల దూరంలో ఉంది. బీచ్ కు చేరుకునే సమయంలో మద్యలో వార్ మెమోరియల్ నుండి డూప్లెక్స్ పార్క్ వరకు అద్భుతమైన ప్రదేశాలను చూడవచ్చు. బీచ్ లో స్థానికులు మార్నింగ్ అండ్ ఈవెనింగ్ వాక్ చేస్తుంటారు. బీచ్ తీరంలో సీఫేసింగ్ రెస్టారెంట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం చూడవచ్చు. చల్లని వాతావరణంలో ఎంజాయ్ చేయడానికి కొన్ని స్నాక్స్ ను కూడా పట్టుకెళ్ళవచ్చు.తమిళనాడు రాష్ట్రంలోని కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రొమెనేడ్ బీచ్ ఉంది.రోడ్డు,రైలు,విమాన మార్గం ద్వారా చెన్నైకి చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు లేదా ప్రైవేటు వాహనాలు,సొంత వాహనాల్లో కూడా పుదుచ్చేరిలోని ప్రొమెనేడ్ బీచ్‌కు చేరుకోవచ్చు..

ప్రొమెనేడ్ బీచ్ ..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos