పార్టీకి సోనియా భారీ శస్త్రచికిత్స చేస్తున్నారు

పార్టీకి సోనియా భారీ శస్త్రచికిత్స చేస్తున్నారు

బెంగళూరు: ‘కాంగ్రెస్ పార్టీలో భారీ ప్రక్షాళన మొదలైంది. ఇక జి-23తో పని లేద’ని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. ‘పార్టీలో సంస్కరణలు అంతర్గతంగా రావాలన్న ఉద్దేశంతో నాయకత్వానికి లేఖ రాసాం.పార్టీ పసునర్నిర్మాణాన్ని కోరుకున్నాం. పార్టీ నాశనాన్ని కోరుకో లేదు. మేము లేవనెత్తిన అంశాన్ని కొందరు దుర్వినియోగం చేశారు. 23 మంది నేతలు కోరుకున్నట్లే అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీలో భారీ సంస్కరణలు మొదలుపెట్టారు. అట్టడుగు స్థాయి నుంచి ప్రక్షాళన మొదలు కావడంతో ఇక జి-23తో పనిలేదు. అసలిప్పుడు దీనికి అర్థం కూడా లేదు. ఇంకా ఎవరైనా దాని గురించి పట్టుబడుతున్నారంటే దాని వెనక స్వార్థ ప్రయోజనాలు ఉన్నట్టే. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచన మంచిదేన’న్నారు.

తాజా సమాచారం