చరవాణి సేవల పునరుద్ధరణ

చరవాణి సేవల పునరుద్ధరణ

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవల్ని శనివారం పునరుద్ధరించారు. ప్రీపెయిడ్ మొబైల్స్ వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేసినట్లు జమ్మూ-కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ ఇక్కడ తెలిపారు. జమ్మూలోని పది జిల్లాలు, కశ్మీర్లోని రెండు జిల్లాల్లో బ్రాడ్బ్యాండ్ సేవల్ని తిరిగి ప్రారంభించాలని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లను కోరారు. మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో సిమ్కార్డుల ఆధారాలు ధ్రువీకరించుకోవాలని టెలికాం ప్రొవైడర్లకు సూచించారు. కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న సైట్లకే అనుమతి ఉంటుందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos