రైతుల పొలాల్లో పైపులైన్లను అనుమతించం

రైతుల పొలాల్లో పైపులైన్లను అనుమతించం

హోసూరు : రైతుల పొలాల్లో పైపులైన్లను వేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్ స్పష్టం చేశారు. కోయంబత్తూరు సమీపంలోని ఇరుగురు నుంచి కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా మాలూరు సమీపంలోని దేవనకుంది వరకు పెట్రోలియం పైపులైన్ వేసేందుకు పనులు నిర్వహిస్తున్నారు. కృష్ణగిరి జిల్లాలో 32 కి.మీ. దూరం పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. దీనిని పొలాల్లో వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. విలువైన వ్యవసాయ భూముల్లో పైపులైన్ వేసే పనులను వెంటనే ఆపేయాలని హోసూరు ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి.అందులో భాగంగా వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్ రైతులకు మద్దతుగా నిలిచారు.సూలగిరి సమీపంలోని కీర్ణపల్లి వద్ద రైతులను కలిసి వారికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలువైన రైతుల భూముల్లో పైపులైన్ వేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని మురుగన్ రైతులకు హామీ ఇచ్చారు. పొలాల్లో బదులు జాతీయ రహదారి వెంబడి పైప్ లైన్ వేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎంకె పార్టీ నాయకుడు ఉద్ధనపల్లి స్టాలిన్, పార్టీ కార్యకర్తలు రైతులకు మద్దతుగా నిలిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos