అనంతపురం: అనంతపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నగరంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో నాలుగవ తరగతి చదువుతున్న బాలిక పై ప్రిన్సిపల్ ఆంజనేయులు గౌడ్ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. శుక్రవారం ఉదయం బాలికని చూడటానికి ఆమె పిన్ని వెళ్లింది. బాలిక ఏడుస్తూ తన పిన్నికి జరిగిన విషయాన్ని చెప్పింది. ప్రిన్సిపల్ ఆంజనేయులు గౌడ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తన పిన్నికి వివరించింది. దీంతో బాలిక పిన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే టూ టౌన్ పోలీసులు ఆంజనేయులు గౌడ్ ను స్టేషన్ కు తరలించారు. బాలిక తల్లి కువైట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసి విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి.