పెట్రోలు ధరలు తగ్గవు గాక తగ్గవు

పెట్రోలు ధరలు తగ్గవు గాక తగ్గవు

కోల్‌కతా: దేశంలో పెట్రోల్ ధరలు దిగివచ్చే అవకాశాలు లేవని కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్ పురి అన్నారు. దీనికి ఆయన పాత పల్లవే పాడారు. పెట్రోల్, డీజిల్ వంటి చమురు ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు సుముఖంగా లేవని అన్నారు. భవానీపూర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం గురువారం కోల్‌కతా వచ్చిన ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ”పెట్రోల్ ధరలను తగ్గించాలని అనుకుంటున్నారా? అని అడిగితే… మా సమాధానం ‘అవును’ అని చెబుతాం. అదే పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? అని అడిగితే మాత్రం.. దానికి కారణం రాష్ట్రాలే అని చెప్పాలి” అన్నారు.
అయితే, మంత్రి సమాధానంపై పలువురు ఆర్ధిక విశ్లేషకులు స్పందిస్తూ… ‘ఇది బొత్తిగా తప్పించుకునే సమాధానమని’ వ్యాఖ్యానిస్తున్నారు. 2014లో పెట్రోల్ పై రూ.9 ఉన్న కేంద్ర పన్ను రూ.32గా, డీజిల్ పై రూ.3 ఉన్న కేంద్ర పన్ను రూ.31గా పెంచారు. దీనికి తోడు కేంద్రం వేసే పన్నులలో సెస్‌ను భారీగా పెంచారు. ఈ సెస్ వసూళ్ళ నుండి రాష్ట్రాలకు పైసా కూడా వాటా ఉండదు. ఈ మొత్తం కేంద్రం ఖాతాకే చేరుతుంది. కేంద్రం వేసే పన్నులు తగ్గించుకుంటే ప్రజలకు కొంత ఉపశమనంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos