మినీ బస్సు బోల్తా : 15 మందికి తీవ్ర గాయాలు

హొసూరు : హొసూరు సమీపంలోని రాయకోట వద్ద బుధవారం మినీ బస్సు బోల్తా పడిన సంఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాయకోట నుంచి హొసూరు వైపు వస్తున్న మినీ బస్సు అలెసీభం గ్రామం వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని దాటబోయి అదుపు తప్పి నడి రోడ్డు మీద బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు హొసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మినీ బస్సు అతివేగంగా వెళ్లడమే కాకుండా మరో వాహనాన్ని దాటడానికి ప్రయత్నించినందువల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.

తాజా సమాచారం