కొవ్వు కరిగించే దుప్పటి

కొవ్వు కరిగించే దుప్పటి

న్యూ ఢిల్లీ : శ్రమించకుండానే 600 కేలరీలను కరిగించే సరికొత్త దుప్పటి – ఇన్ఫ్రారెడ్ సావున విపణిలోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎడ్వర్డ్ హాడ్జ్, వ్యాట్ వెస్ట్మోర్ల్యాండ్ వ్యాపారవేత్తలు కలిసి ‘మైహై’ బ్రాండ్ పేరుతో వీటిని విక్రయిస్తున్నారు. సంచిలా ఉండే ఈ దుప్పట్లో దూరి 45 నిమిషాలపాటు పడుకుంటే చాలు. ఒంట్లోని దాదాపు 600 క్యాలరీలు కరగిపోతాయట. దేహానికి కొత్త మెరుపు వస్తుంది. మెదడుకు కూడా మంచి విరామం లభిస్తుందని ఉత్పత్తిదారులు చెప్పారు. ఇన్ఫ్రారెడ్ సావునాను సాంకేతిక పరిజ్ఞానం గతంలోనే అందుబాటులో ఉంది. దాన్ని తాము దుప్పట్టలో అమర్చి విక్రయిస్తున్నామని వివరించారు. ఇవి సత్ఫలితాలిస్తోందని వెల్ నెస్ గ్రూప్ యాంటీ ఏజింగ్ నిపుణురాలు మెడలిన్ కాల్ఫాస్ తెలిపారు. ఆన్లైన్లో దీని వెల 549 డాలర్లు- రూ.42 వేలు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos