ఈ మామిడి కిలో రూ.2.70 లక్షలు..

ఈ మామిడి  కిలో రూ.2.70 లక్షలు..

న్యూ ఢిల్లీ : అత్యంత తీపిగా ఉండే, ఖరీదైన మామిడి పండు- జపాన్ లో పండే మియాజాకి. వంగపూవు రంగులో ఉంటుంది. అంతర్జాతీయ విపణిలో దీని ధర కిలో రూ.2. 70 లక్షలు. మియాజాకి పట్టణంలో సాగవుతున్నందున దీనికి ఆ ఊరి పేరు వచ్చింది. ఒక్కో పండు బరువు 350 గ్రాములు ఉంటుంది. ఇందులో చక్కెర పరిమాణం 15 శాతం. రంగు, ఆకృతి లో రంగుల్లో ఇది సాధారణ మామిడి పండ్లకు భిన్నంగా ఉంది. జపాన్ వాసులు ఈ పండును ‘ఎగ్ ఆఫ్ సన్’ గా భావిస్తుంటారు. ఏటా ఏప్రిల్ నుంచి ఆగస్ట్ సీజన్ లో మియాజాకి దిగుబడికి వస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా , బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ప్రస్తుతం ఈ రకం మామిడి మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్,బంగ్లాదేశ్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలకూ వ్యాపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos