21 ఏళ్లకే న్యాయమూర్తి

21 ఏళ్లకే న్యాయమూర్తి

జైపూర్: దేశంలో అత్యంత చిన్న వయసులోనే న్యాయాధికారిగా రాజస్థాన్ యువకుడు మయాంక్ ప్రతాప్ (21) బాధ్యతల్ని చేపట్టనున్నారు. 2019 రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీస్(ఆర్జేఎస్) పరీక్షలో అగ్రగామిగా నిలిచాడు. ఇక్కడి మాన్సరోవర్కు చెందిన మయాంక్ రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సును గత ఏప్రిల్లో పూర్తి చేసి పట్టా పొందాడు. అనంతరం నిర్వహించిన రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గతంలో ఆర్జేఎస్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత వయసు 23ఏళ్లు ఉండేది. రాజస్థాన్ ఉన్నత న్యాయస్థానం దాన్ని 21 ఏళ్లకు తగ్గించింది. ‘నేను ఆర్జేఎస్ పరీక్ష ఉత్తీర్ణత సాధించ డానికి రోజుకు 13 గంటలు చదివాను. ఫలితంతో సంతోషించాను. మంచి న్యాయమూర్తికి దయా గుణం ఎంతో ముఖ్యమైంది. ఎలాం టి బాహ్య ప్రభావాలకు లోను కాకూడద’న్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos