శారీరకంగా,మాసికంగా ఎంతో బాధపడ్డా..

  • In Film
  • November 12, 2019
  • 158 Views
శారీరకంగా,మాసికంగా ఎంతో బాధపడ్డా..

చేసింది తక్కువ చిత్రాలే అయినా భిన్నమైన పాత్రలతో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది.తాను ఓ వివాహితుడితో సంబంధం పెట్టుకుని శారీరకంగా,మాసికంగా ఎంతో బాధపడినట్లు చెప్పింది. అతడి నుండి బయటపడి ఆయుర్వేద చికిత్స పొంది ఉపశమనం పొందుతున్నట్లు పేర్కొంది. తనను మోసం చేసిన వ్యక్తి ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.అయితే ఆ వ్యక్తి ఎవరనేది తాను రాసుకున్న పుస్తకంలో బయటపెడతానని సంచలనం సృష్టించింది. అయితే ఇప్పటివరకు ఆ పుస్తకాన్ని విడుదల చేయలేదు.ఆ వ్యక్తి బెదిరించడం వలనే ఆండ్రియా తన పుస్తకాన్ని విడుదల చేయలేదనే ప్రచారం జరిగింది.ఆ వ్యక్తికి రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయని.. సినిమా రంగంలోనూ ఉన్నాడని సమాచారం.పుస్తకం విడుదల తెలుసుకున్న ఆ వ్యక్తి ఆండ్రియాని బెదిరించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో ఆండ్రియా పుస్తకం బయటకి వచ్చే ఛాన్స్ లేదనిపిస్తోంది. మళ్లీ నటనపై దృష్టి సారించిన ఆండ్రియాకు ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos