కొండపై పెళ్లికి కొత్త ఆంక్ష

కొండపై పెళ్లికి కొత్త ఆంక్ష

తిరుపతి : తిరుమల కల్యాణ వేదికలో పెళ్లి చేసుకోదలచినవారు ఇకపై తప్పనిసరిగా అవివాహితులమనే ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని గురువారం తితిదే పాలకమండలి ఉత్తర్వుల్ని జారీ చేసింది. రెండు నెలల కిందట ఈ మేరకు తీసుకున్న నిర్ణ యాన్ని తు.చ తప్పకుండా అమలు చేయాలని తాజాగా తీర్మానించింది. శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోదలచిన వారికి తిరు మల కల్యాణవేదికలో తితిదే ఉచితంగా వివాహాలు జరిపిస్తోంది. దీని కోసం వధువు, వరుడు పుట్టిన తేదీలు, విద్యార్హత పత్రా లు, తల్లిదండ్రుల ఆధారకార్డులు, శుభలేఖ, లగ్నపత్రికను సమర్పించాల్సి ఉంటుంది. వధువు, వరుడు తల్లిదండ్రులు తప్పని సరిగా వివాహానికి హాజరు కావాలి. ఒకవేళ ఎవరైనా మరణించి ఉంటే వారి మరణ పత్రాన్ని జత చేయాలి. అయితే కొందరు భార్య, లేక భర్త విడిపోయి తిరుమలలో రెండో వివాహం చేసుకోవడంతో తితిదేకు ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఇతర పత్రా లతోపాటు అవివాహితులనే పత్రాన్ని జత చేయాలని కొత్తగా అంక్షల్ని విధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos