క్రెడిట్ కార్డులకూ మారటోరియం వర్తింపు

  • In Money
  • March 27, 2020
  • 136 Views
క్రెడిట్ కార్డులకూ మారటోరియం వర్తింపు

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి రిజర్వు బ్యాంక్ తీపి కబురు అందించింది. లోన్ ఈఎంఐ మారటోరియం రూల్స్ క్రెడిట్ కార్డుకు కూడా వర్తిస్తాయని స్పష్టతనిచ్చింది. దీంతో క్రెడిట్ కార్డు కలిగిన వారికి ప్రయోజనం కలుగనుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  ఈఎంఐలపై 3 నెలల పాటు మారటోరియం విధించింది. ఇది అన్ని రుణాలకు వర్తిస్తుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, పంట రుణాలు వంటివి అన్నీ కవర్ అవుతాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలన్నీ తమ కస్టమర్లకు ఈఎంఐ మారటోరియం ప్రయోజనాన్ని అందించనున్నాయి. అయితే క్రెడిట్ కార్డు బకాయిలపై మాత్రం ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఆర్‌బీఐ క్రెడిట్ కార్డు బకాయిలపై కూడా స్పష్టతనిచ్చింది. వీటికి కూడా ఈఎంఐ మారటోరియం రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. నెలవారీ ఈఎంఐలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలు కూడా  మారటోరియం కిందకు వస్తాయని స్పష్టం చేసింది. దీంతో క్రెడిట్ కార్డుదారులకు ప్రయోజనం కలుగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos