నేటి ఢిల్లీ ఒక హర్రర్ సినిమా

నేటి ఢిల్లీ ఒక హర్రర్ సినిమా

ముంబై:ఢిల్లీలో సాగుతున్న హింసాకాండ ఒక హర్రర్ సినిమాను తలపిస్తోందని శివసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లను తలపించే విధంగా ఉందని తన అధికార పత్రిక సామ్నా కథనంలో బుధవారం వ్యాఖ్యానించింది.అమెరికా అధ్యక్షుడు ఇండియా పర్యటనలో ఉన్నపుడు సంభవించిన రక్తపాతం ఢిల్లీకి మచ్చ తెచ్చేది. వీధుల్లో రక్తపాతం జరుగుతున్నపుడే ట్రంప్ కు ఢిల్లీ స్వాగతం పలికింది. ఢిల్లీ హింస వల్ల శాంతిభద్రతలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే సందేశం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ వీధుల్లో కర్రలు, కత్తులు, తుపాకీలు పట్టుకున్న ప్రజలు కనిపిస్తున్నారు. వీధుల్లో రక్తం ఏరులై పారుతోంది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని భాజపా ఇప్పటికీ విమర్శిస్తోంది.ఇప్పుడు ఢిల్లీ హింసకు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రేమ సందేశంతో వచ్చిన ట్రంప్ ను అహ్మదాబాద్ ‘నమస్తే’ అంటూ ఆదరించింది. ఢిల్లీ హింసతో స్వాగతించింది.ఏ రోజు కూడా ఢిల్లీకి ఇంతటి చెడ్డ పేరు రాలేదు. ఈ హింస వెనుక ఒక కుట్ర దాగుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఆర్టికల్ 370,35ఏల రద్దు తర్వాత అల్లర్లు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. అల్లర్ల వెనుక ఏదైనా కుట్ర ఉన్నట్టైతే అది కచ్చితంగా జాతీయ భద్రతకు ముప్పే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos