రాజీనామా వద్దు

రాజీనామా వద్దు

హైదరాబాదు: నటుడు ప్రకాశ్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం తనకు అసంతృప్తి కలగించిందని మంచు విష్ణు పేర్కొన్నారు. “మీరు నాకుంటే ఎంతో పెద్ద వారు. ఒకే నాణేనికి బొమ్మ, బొరుసులా గెలుపోటములు ఉంటాయని మీకు తెలుసు. దీన్ని మనం ఒకేలా స్వీకరిద్దాం. దయచేసి మీరు భావోద్వేగాలకు లోను కాకండి. మీరు మా కుటుంబంలో ఒక ముఖ్య భాగం. మీ ఆలోచనలు మాకు కావాలి, మనం కలిసి పనిచేయాల్సి ఉంది. మీరు ఇప్పుడు వెంటనే నాకు బదులు ఇవ్వొద్దని కోరుతు న్నాను. త్వరలో నేనే మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఐ లవ్యూ అంకుల్. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు! మనం ఎప్పటికీ ఒక్కటే ’అని ప్రకాశ్ రాజుకు విన్నవించారు. ‘మా’ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించావంటూ మంచు విష్ణును ప్రకాశ్ రాజ్ అభినందించారు. ‘మా’ను నడిపిం చేందుకు సకల శక్తులు ప్రాప్తించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ‘మా’లో సభ్యుడ్ని కాకపోయినా తన అవసరం ఉందనుకుంటే తప్పకుండా మద్దతు ఇస్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos