మాట తప్పిన మోదీ

మాట తప్పిన మోదీ

కోల్కతా: బుల్ బుల్ తుపాను బారిన పడిన తమ రాష్ట్రానికి కేంద్రం చిల్లిగవ్వ కూడా విదిల్చలేదని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జి సోమవారం దుయ్యబట్టారు. ‘రాష్ట్రానికి ఆర్ధిక సాయం చేస్తామని ట్విటర్లో ప్రధాని ప్రకటించారు. ఇప్పటి వరకు నిధుల విడుదల ఊసే లేద’ని పశ్చిమ బంగ శాసనసభలో ధ్వజమెత్తారు. ‘ బుల్ బుల్ తుపాను తర్వాత కేంద్ర బృందం ఒకటి రాష్ట్రానికి వచ్చి సర్వే చేసింది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆర్ధిక సాయం అంద లేదు. రూ.23 811.60 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఆరు గురు ప్రాణాలు కోల్పో యారు. సాయం చేస్తామని మోదీ ట్విటర్లో ప్రకటించారు. ఇంత వరకు నిధులు విడుదల కాలేద’ని విశదీకరించారు. బుల్ బుల్ తుపాను వల్ల సంభవించిన నష్టం గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులి చ్చిన పు డు కేంద్రం వైఖరినీ విపులీకరించారు. రైతుల్ని ఆదుకు నేందు కు రాష్ట్ర ప్రభుత్వమే నుంచి రూ.1200 కోట్లు విడుదల చేసిం ద న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos