కిరణ్ బేడీకి మంత్రి మల్లాది సవాల్

కిరణ్ బేడీకి మంత్రి మల్లాది సవాల్

పుదుచ్చేరి: గవర్నర్ కిరణ్ బేదీ తన పదవికి రాజీనామా చేస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకొనేందుకు సిద్ధమని రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు సవాలు విసిరారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘గవర్నర్ కార్యదర్శి పదవి రెండేళ్ల నుంచి ఖాళీగా వుంది. ప్రభుత్వ శాఖల్లోని అన్ని పదవులను భర్తీ చేయాలని చెబుతున్న గవర్నర్ తన కార్యదర్శి పదవిని మాత్రం ఎందుకు భర్తీ చేయడం లేదు. రాజ్నివాస్లోని ఒక మహిళా అధికారి క దళారి కోరిన విధంగా పనులు చేసి నాలుగేళ్లలో కోట్లాది రూపాయలు సంపాదించారు. ప్రతి విష యంలోను సీబీఐ విచార ణకు చేపడతామని పే ర్కొంటున్న గవర్నర్, ఆ మహిళా అధికారి వ్యవహా రంపై ఎందుకు సీబీఐ విచారణ చేపట్టలేదు. ప్రస్తుతం రాజ్నివాస్లో స్వచ్ఛత లేదు. అది గవర్నర్కు తెలిసే జరుగుతుందనే అనుమానం ఉంది. ప్రజాసంక్షేమ నిధులను కూడా గవర్నర్ ఖర్చు చేస్తున్నారు. సంబంధిత ఆధారాలు లేకుండా చేస్తున్నారు. నేను 31 ఏళ్లుగా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నా. రెండేళ్ల అనంతరం ఒక్కరోజు కూడా తాను పుదుచ్చేరిలో ఉండనని గవర్నర్ ప్రకటించారు. ఆమె పదవికి రాజీనామా చేస్తే, నేను పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఎన్నికల్లో కూడా పోటీ చేయను. నా సవాలును స్వీకరించేందుకు గవర్నర్ సిద్ధమా? గవర్నర్ అడ్డుకుంటున్న ప్రజా సంక్షేమ పథకాల అమలుకు కోర్టుకు వెళతాన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos