క్రియాశీల రాజకీయాలకు దూరం

క్రియాశీల రాజకీయాలకు దూరం

న్యూ ఢిల్లీ: మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తన రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్గా ఆయన పదవీకాలం నిన్నటితో పూర్తయింది. ఆయన రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) పార్టీలో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని, క్రియాశీలక రాజకీ యాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు లేవని, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అసలే లేదన్నారు. రైతు సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం భాగస్వామిని అవుతానన్నారు. సత్యపాల్ మాలిక్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగానే విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు సాగుచట్టాలను విమర్శించిన ఆయన జమ్మూకశ్మీర్లో అవినీతిపైనా విమర్శలు చేశారు. 2020 నుంచి మాలిక్ మేఘా లయ గవర్నర్గా ఉన్నారు. అంతకుముందు బీహార్, జమ్మూకశ్మీర్ గవర్నర్గా పనిచేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos