కేజీఎఫ్‌ దర్శకుడితో మహేశ్‌ తదుపరి చిత్రం!

  • In Film
  • October 21, 2019
  • 31 Views
కేజీఎఫ్‌ దర్శకుడితో మహేశ్‌ తదుపరి చిత్రం!

సంక్రాంతి లక్ష్యంగా మహేశ్ బాబు కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో తదుపరి చిత్రంపై మహేశ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.గతంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన మహేశ్ ఇప్పుడు ఆ ఆలోచనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.గత ఏడాది కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి మహేశ్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.వంశీ పూర్తి కథ సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉండడంతో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో మహేశ్ ప్రశాంత్‌కు కాల్‌ చేశాడనీ .. ఇటీవలే ఇద్దరి మధ్య చర్చలు జరిగిపోయాయని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకూ ఈ ప్రాజెక్టే పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్‌..

తాజా సమాచారం