సర్కారు వారి పాటలో మహానటి..

  • In Film
  • October 17, 2020
  • 25 Views
సర్కారు వారి పాటలో మహానటి..

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టు సర్కారు వారి పాటపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాంకు మోసాల నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ అల్ట్రా స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఐతే సినిమా ప్రకటనైతే వచ్చింది గానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. కరోనా కారణంగా ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు.ఐతే తాజగా సర్కారు వారి పాట నుండి ఒకానొక అప్డేట్ బయటకి వచ్చింది. చాలా రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయమై ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. కీర్తి సురేష్ అని వినిపించినప్పటికీ చిత్ర బృందం కన్ఫర్మ్ చేయకపోవడంతో ఆ అనుమానం అలాగే ఉండిపోయింది. ఈ రోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్, సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ అని ప్రకటించాడు. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్, సర్కారు వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos