అసెంబ్లీ రద్దు దిశగా సేన సంకేతాలు

అసెంబ్లీ రద్దు దిశగా సేన సంకేతాలు

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు దిశగా సంకేతాలు వస్తున్నాయి. తిరుగు బాటు మంత్రి ఏక్ నాథ్ షిండే, 40 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే చర్చలు విఫలం కావడం ఇందుకు కారణం. షిండే ఎప్పటి నుంచో శివ సైనికుడని, అతడు తమతోనే ఎప్పటికీ ఉంటాడని, చర్చలు జరుగుతున్నాయని ప్రకటించిన సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్వరం మార్చారు. ‘మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు విధాన సభ రద్దు దిశగా కొనసాగుతున్నాయి’’ అంటూ ఆయన మరాఠీలో ఓ పోస్ట్ పెట్టారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. మహారాష్ట్రలో సంకీర్ణ ఎంవీఏ సర్కారు విధాన సభ రద్దుకు సిఫారసు చేస్తే దాన్ని గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం లేదు. గవర్నర్ కు ఆమోదం అయితే సభను రద్దు చేయవచ్చు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారి కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos