దీనిని విని తీరాల్సిందే…

దీనిని విని తీరాల్సిందే…

హైదరాబాద్: అలనాటి పాపులర్ టెలివిజన్ సీరియల్ ‘మహాభారత్’ టైటిట్ సాంగ్‌ను ఆసాంతం అద్భుతంగా ఆలపించి ఒక ముస్లిం ప్రశంసలందుకుంటున్నారు. ఆయన స్వరానికి, స్పష్టమైన ఉచ్చారణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఐకానిక్ ట్రాక్‌ను హృద్యంగా ఆలపించిన ఈ వీడియోను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై. ఖురైషి షేర్ చేశారు. బీటింగ్ ది స్టీరియోటైప్స్ అంటూ ఆయన షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హిందూ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన రామాయణ, మహాభారత సీరియల్స్ టెలివిజన్ చరిత్రలో గొప్ప సంచలనం రేపాయి. ఆదివారం ఉదయం ప్రసారమయ్యే వీటి కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేశారు. తాజా వీడియోతో ఈ ఐకానిక్ టైటిల్ సాంగ్ వినపడగానే అందరూ టెలివిజన్ సెట్ల ముందుకు చేరిపోయే వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిమిషం, 9 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. లక్షా 12 వేలకు పైగా వ్యూస్, రీట్వీట్లు, లైక్స్‌తో సందడి చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos