మదీనా ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు

మదీనా ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు

<మదీనా: మదీనా ప్రావిన్స్, అల్ అఖల్ సెంటర్ వద్ద గత బుధవారం సంభవించిన రహదారి ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు ఉన్నట్లు తేలిందని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. గాయపడిని ఇద్దరు ప్రస్తుతం జెద్దా ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. మరో ఏడుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తొమ్మిది మంది వివరాల్ని ట్విటర్లో ఉంచారు. మరింత సమాచారం కోసం జెద్దా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. యాత్రికులతో వెళుతున్న ప్రైవేటు బస్సు, భారీ వాహనాన్ని ఢీకొట్టటంతో ప్రమాదం సంభవించింది. మొత్తం 35మంది విదేశీ యాత్రికులు మరణించారు. వీరిలో భారతీయులు ఉన్నారో లేదో కూడా ఇంకా తెలియరాలేదు. అక్కడి రాయబార కార్యాలయంతో దీని గురించి వాకబు చేస్తున్నామని విదే శాంగ మంత్రి జై శంకర్ ప్రకటించారు.

తాజా సమాచారం