జార్జిరెడ్డి మళ్లీ ‘పుడతాడు’

జార్జిరెడ్డి మళ్లీ ‘పుడతాడు’

హైదరాబాదు: విద్యార్థి నేత, పీడీఎస్యు వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి మళ్లీ పుడతాడని జార్జి రెడ్డి-చిత్రం దర్శకుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యా నించారు. శుక్రవారం ఆ సినిమా విడుదల కానున్నందున చిత్రం తయారీ బృందం గురువారం నారాయణగూడ స్మశాన వాటి కలో జార్జిరెడ్డి సమాధి వద్ద ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు. ‘నీతి, నిజాయతీని నిలు వెల్లా నింపుకున్న విద్యార్థి నేత జార్జ్ రెడ్డి. ఈ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడ్డా. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మెట్లపై పడుకుని జార్జి రెడ్డి గుండె చప్పుడునువిన్నా. హింసను ప్రేరేపించేలా ఈ చిత్రం ఉంటుందన్న ప్రచారంలో నిజం లేదు. అన్యా యాన్ని ప్రశ్నిం చాలనే సందేశం ఉంటుంది. ఈ చిత్రంతో జార్జ్ రెడ్డి మళ్లీ పుడతాడ’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos