ఇంకా ఏడు కెమెరాల ఫుటేజి ఏమైంది?

ఇంకా ఏడు కెమెరాల ఫుటేజి ఏమైంది?

హైదరాబాదు : మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన ప్రకాశ్ రాజ్, బెనర్జీ, తనీశ్ ఇక్కడ వీడియో ఫుటేజిని తనిఖీ చేశారు. అనంతరం ప్రకాశ్ రాజ్ విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.‘నాకు విష్ణుతో ఇబ్బంది లేదు. సమస్య అంతా ఎన్నికల అధికారితోనే. ఎన్నికల వేళ రికార్డయిన సీసీ కెమెరాల ఫుటేజి ఇవ్వాలని ఇటీవల లేఖ రాస్తే, మొదట సరే అన్నారు. ఏం జరిగిందో ఏమో ఆ తర్వాత ఫుటేజి ఇవ్వడం కుదరదన్నారు. దానికో పద్ధతి ఉంటుందని చెబుతున్నారు. మేం దానికి తగ్గట్టుగానే వెళుతున్నాం. ఇవాళ కొంత ఫుటేజి పరిశీలించాం. ఇంకా ఏడు కెమెరాలకు సంబంధించిన ఫుటేజి ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వద్దే ఉంది. దాన్ని కూడా పరిశీలించిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్నీ మాట్లాడతాం” అని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos