లవ్ జిహాద్ ఎన్నికల ఎత్తుగడ

లవ్ జిహాద్ ఎన్నికల ఎత్తుగడ

ముంబై : పశ్చిమ బంగ శాసనసభ ఎన్నికలు సమీపించినందునే భాజపా లవ్ జిహాద్ పై చర్చకు తెర తీసిందని శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఎన్నికల ముంగిట్లో ఏదో ఒక విషయం కావాలి. అందుకే లవ్ జిహాద్ ని ఎత్తుకున్నారు. అది చాలా గంభీరమైన అంశం. దీనిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో అభివృద్ధే అంజెండాగా ఉండాలి .కానీ లవ్జిహాద్ ను ముందుకు తెచ్చారు. దానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం తేవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం ఉద్ధవ్తో కూడా చర్చించాం. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎప్పుడు లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టం తీసుకొ స్తారో. అప్పుడే మేమూ ఆలోచిస్తామ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos