నష్టాల విపణి

నష్టాల విపణి

ముంబై: గత ఎనిమిది రోజుల పాటు లాభాల్ని గడించిన స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల బారినపడ్డాయి. మదుపర్లు బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ స్టాకుల్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ఇందుకు కారణం. ఒక దశలో సెన్సెక్స్ 466 పాయింట్ల వరకూ నష్ట పోయింది. ఆ తర్వాత కొంత మేరకు పుంజుకుంది. బీఎస్ ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 43,357కి, నిఫ్టీ 58 పాయింట్లు తగ్గి 12,690 వద్ద నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో హిందుస్థాన్ యూనిలీవర్ (2.89%), ఐటీసీ (1.43%), ఎల్ అండ్ టీ (1.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.06%), టెక్ మహీంద్రా (0.81%) బాగా లాభాల్ని గడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.16%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.91%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.41%), ఎన్టీపీసీ (-2.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.10%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos