చైనాతో వ్యాపార పోటీ మనకే నష్టం

చైనాతో వ్యాపార పోటీ మనకే నష్టం

న్యూ ఢిల్లీ: చైనాతో భారత్ వాణిజ్య యుద్దానికి దిగితే భారత్కే ఎక్కువ నష్టమని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా హెచ్చరించారు. ది వైర్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా తో ట్రేడ్వార్కు దిగితే భారత్ పూర్వపు ఆర్ధికాభివృద్దిని సాధించేందుకు ఏళ్ల తరబడి సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘చైనా ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం మూడు శాతం మాత్రమే. చైనా నుంచి భారత్ దిగుమతులు 15 శాతం వరకు ఉన్నాయి. ఇవన్నీ కీలక రంగాల్లో ఉన్నాయి. వాటి దిగుమతులపై ఆంక్షలు పెడితే భారత పారిశ్రామికవేత్తలే నష్ట పోతారు. చైనా దిగుమతుల పైన భారత్ ఆంక్షలు విధిస్తే మన ఎగు మతు లపైనా చైనా ఆంక్షలు విధిస్తుంది. ఇది భారత్కు ఎక్కువ నష్టం కల్గిస్తుంది. భారత్కు చైనా ఎగుమతులు మూడు శాతం కాగా చైనాకు భారత్ ఎగుమతులు ఆరు శాతం. ఆంక్షలు విధించడం వల్ల దిగుమతుల్లో, ఎగుమతుల్లో భారత్ ఆర్ధిక వ్యవస్తే ఎక్కువగా నష్టపోతుంది. కరోనాకు ముందు భారత ఆర్ధికాభివృద్ది రేటు 4.2 శాతం. గతంలో మనం 7.5 శాతం ఆర్దికాభివృద్ధిని సాధించాం. ఆర్ధిక మాంద్యం కారణంగా భారత వృద్ధి రేటు మూడు శాతం వరకు తగ్గిపోయింది. లాక్డౌన్తో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదు, భవిష్యత్తులోనూ రాబోదు. ఇటువంటి కష్టసమయంలో చైనాతో పోటీకి దిగితే మనం తిరిగి 7.5 శాతం ఆర్ధికాభివృద్ధి సాధించడం కలగానే మిగిలిపోతుంది. చైనాతో ఘర్షణ పడడం మానేసి మన ఆర్ధిక వ్యవస్థను 10 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎలా మార్చాలనే దానిపై దృష్టి పెట్టాలి. ఇప్పటికే చైనా 14 ట్రిలియన్ డాలర్ల ఆర్ధికవ్యవస్థగా ఉంది. భారత్ ఆర్ధిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంటే సరిహద్దుల్లో పరి స్థితులు కూడా సజావుగా ఉంటాయ’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos