విరివిగా రుణాలు ఇవ్వండి

విరివిగా రుణాలు ఇవ్వండి

న్యూఢిల్లీ : కరోనా పీడనకు గురయిన ప్రజల జీవనోపాధిని కాపాడేండుకు ఉదారంగా నగదు వితరణ చేయాలని, వ్యాపారాలకు రుణాలు ఇవ్వాలని మాజీ ప్రధాని మన్మోహన సింగ్ ప్రధాని మోదీకి సూచించారు. ఆర్థిక మందగమనాన్ని మానవతా సంక్షోభంగా అభివర్ణించారు. వ్యాపారులకు తగిన మూలధనాన్ని అందుబాటులో ఉంచాలని, సంస్థా గత స్వయం ప్రతిపత్తి ద్వారా ఆర్థిక రంగాన్ని రక్షించాలనీ కోరారు. లాక్ డౌన్ అమల్లో కేంద్రం సరిగ్గా వ్యవహరంచలేదని విమర్శించారు. అకస్మాత్తుగా, ఆలోచనా రహితంగా, ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్ డౌన్, కఠిన ఆంక్షలు ప్రజలు తీవ్రంగా బాధించాయని చెప్పారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి నిర్వహణను స్థానిక సంస్థలకు అప్పగించి ఉండాల్సిందన్నారు. కేంద్ర విస్తృత మార్గదర్శకాలతో, స్థానిక పరిపాలనా సంస్థలు కరోనా నివారణలో ఇంకా ఉత్తమంగా పనిచేసే ఉండేవని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో అధిక రుణాలు అవసరమన్నారు. సైనిక, ఆరోగ్యం, ఆర్ధిక సవాళ్ల అవసరాలకు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో అదనంగా 10 శాతం ఖర్చు చేసినా తప్పు కాదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి, సరిహద్దు రక్షణ, జీవనోపాధి పునరుద్ధరణ, ఆర్థిక వృద్ధికి అధిక రుణాలు అవసరమని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos