బాలుని హంతకునికి జీవిత ఖైదు

బాలుని హంతకునికి జీవిత ఖైదు

హొసూరు : ఇక్కడికి సమీపంలోని కెలమంగలంలో జరిగిన బాలుడి హత్య కేసులో నిందితునికి స్థానిక కోర్టు యావ జ్జీవ కారాగార శిక్ష విధించింది. కెలమంగలం చౌడేశ్వరి దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న అల్తాఫ్ అదే ప్రాంతంలోని భాను అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయం భాను అన్న కొడుకు ఇస్మాయిల్(9)కు తెలిసింది. బంధువులకు చెప్పేస్తాడనే అనుమానంతో అల్తాఫ్ ఆ బాలునికి మాయమాటలు చెప్పి కెలమంగలం సమీపంలోని బేవనాథం కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొండ పైనుంచి బాలుని కిందకు తోసి హత్య చేశాడు. హతుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్తాఫ్‌ను అరెస్టు చేశారు. 2011లో ఈ సంఘటన జరిగింది. హొసూరు కోర్టు జీవిత ఖైదును  విధిస్తున్నట్లు తీర్పును వెలువరిస్తున్న సమయంలో అల్తాఫ్ అక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు అతనిని జైలుకు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos