యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు

యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు

కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఉగ్రవాదులకు, సంఘ విద్రోహ శక్తులకు నిధులు అందించారనే కేసులో శిక్షను ఖరారు చేసింది. యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని కోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోరింది. ఇదే సమయంలో శిక్షను విధించేటట్టయితే జీవిత ఖైదును విధించాలని డిఫెన్స్ లాయర్లు కోర్టును విన్నవించారు. ఇరుపక్షాల వాదలను విన్న కోర్టు… ఈరోజు శిక్షను వెలువరించింది. యాసిన్ కు జీవిత ఖైదును విధించింది.
మరోవైపు యాసిన్ మాలిక్‌కు ఈరోజు శిక్షను ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి శ్రీనగర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్రోహశక్తులు అరాచకాలకు తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఇంటర్‌నెట్‌ను నిలుపుదల చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos