నీతి, నియమాలు లేని నితీశ్

నీతి, నియమాలు లేని నితీశ్

పాట్నా : ముఖ్యమంత్రి నితీశ్ పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ శుక్రవారం విడుదల చేసిన వీడియోలో నితీశ్న తూర్పార బట్టారు. ‘ముఖ్యమంత్రి కుర్చీ కోసం రాష్ట్రాన్నే సంకటంలోకి నెట్టేశారు. 2010 ఎన్నికల్లో మెజారిటీ సాధించిన అతడు మిత్ర పక్షాలను మోసం చేశారు. 2015 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన తర్వాత మిత్ర పక్షాలను వెన్నుపోటు పొడిచారు. నితీశ్కు నియమాలు, విధానాలు, నీతులంటూ ఏమీ లేవు. సీఎం కుర్చీలో పదహైదేళ్లు గడిచి పోయాయి. ఈ వ్యవధిలో నితీశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేసారు. విద్యా విధానం, ఆరోగ్య రక్షణ, నిరుద్యోగులకు ఉపాధి, రైతుల క్షేమం ..ఇలా అన్నింటినీ కుర్చీ కోసం నితీశ్ వదిలేసుకున్నారు. అధికార దాహంతో ఉన్న వారికి ప్రజలు సరైన బుద్ధి చెప్పాలి. ఈ దిశలోనే బిహార్ ప్రజానీకం ముందుకు సాగాల’ని పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos