అగ్నిపథ్​’పై ఆగని నిరసనల హోరు

అగ్నిపథ్​’పై ఆగని నిరసనల హోరు

న్యూ ఢిల్లీ : అగ్నిపథ్ కు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారత్ మాతా కీ జై , అగ్నిపథ్ వెనక్కి తీసుకోవాలనే నినాదాలు చేస్తూ యువత పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. బిహార్, యూపీల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్రలతో రైల్వేస్టేషన్లలోకి ప్రవేశించిన ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. బిహార్లోని లఖీసరాయ్ రైల్వే స్టేషన్లో ఓ రైలుకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఐదు కంపార్ట్మెంట్లు కాలిపోయాయి. రైళ్లోని ప్రయాణి కులు భయాందోళనలకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వీడియో తీయకుండా ఆందోళనకారులు తమ ఫోన్లను లాక్కున్నట్లు స్థానిక పోలీసు సిబ్బంది వెల్లడించారు. నిరసనకారులు బిహార్లోని మెహియుద్దీనగర్ స్టేషన్లో జమ్మూ తావీ ఎక్స్ప్రెస్ రైళ్లోని రెండు బోగీలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బెగూసరాయ్, బెట్టియా ప్రాంతాల్లోనూ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బిహార్లో రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం తలెత్తింది. బెట్టియాలోని ఉప ముఖ్యమంత్రి రేణు దేవి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. తమ ఇంటిపై దాడి జరిగినట్లు ఆమె కుమారుడు తెలిపారు. ఈ దాడుల్లో భారీగా నష్టపోయామని చెప్పారు. ప్రస్తుతం రేణు దేవి పట్నాలో ఉన్నారని వెల్లడిం చారు. యూపీలోని బలియా జిల్లాలో ఓ రైల్వేస్టేషన్లోకి ప్రవేశించిన ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. రైలుబోగీలకు నిప్పుపెట్టారు. అక్కడున్న పోలీసు సిబ్బందిపైకి రాళ్లు విసిరినట్లు స్థానిక డీఎం సౌమ్య అగర్వాల్ వెల్లడించారు. వీరిలార్క్ స్టేడియంలో సమావేశమైన నిరసనకారులు అక్కడ నుంచి బలియా రైల్వేస్టేషన్కు ర్యాలీగా వచ్చి విధ్వంసం సృష్టించినట్లు తెలిపారు. స్టేషన్ వెలుపల బస్సులపైనా నిరసనకారులు దాడి చేసినట్లు వివరించారు. ఆందోళనల్లో ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని మూడు రైళ్లల్లోని బోగీలు, బిహార్లోని కుల్హరియాలో ఓఖాళీ రేక్, యూపీలోని బలియాలో ఓ కోచ్ను ధ్వంసమైనట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos