మహిళను చెట్టుకు కట్టేసి

మహిళను చెట్టుకు కట్టేసి

కుప్పం:  నియోజకవర్గంలో  అప్పు తీర్చలేదని ఓ మహిళను పట్టపగలు నిర్దాక్షిణ్యంగా చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. అందుకు సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళపై దాడి చేసిన వారిపై వెంటనే అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సీఎం ఎస్పీతో మాట్లాడగా.. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటను పునరావృతం కాకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు వార్నింగ్ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos