కేటీఆర్‌కు అభిమానుల పుట్టినరోజు కానుక ఏంటో తెలుసా!

కేటీఆర్‌కు అభిమానుల పుట్టినరోజు కానుక ఏంటో తెలుసా!

 రెండు తెలుగు రాష్ట్రాల్లో,రాజకీయాల్లో తెరాస కార్యాధ్యక్షుడు కేటీఆర్‌కు ఉన్న పాపులారిటీ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.ఎన్నో సమయాల్లో ఎంతోమందికి వ్యక్తిగతంగా కూడా సహాయసహకారాలు అందించడంతో ప్రాంతాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్‌ను అభిమానిస్తుంటారు.అదొక్కటే కాదు కేసీఆర్‌లానే కేటీఆర్‌ కూడా మంచి వాగ్ధాటి ఉన్న నేత కావడంతో కేటీఆర్‌ ప్రసంగాలకు చాలా మంది అభిమానులుగా మారారు.ఈ నేపథ్యంలో బుధవారం(జులై24)కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా తెరాస నేతలు ఉభయ రాష్ట్రాల్లోని కేటీఆర్‌ అభిమానులు కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటున్నారు.అయితే కేటీఆర్‌ మాత్రం తన పుట్టినరోజుకు ప్లెక్సీలు పెట్టడం,బ్యానర్లు కట్టొద్దని బహుమతులు తీసుకురావద్దని అందుకు బదులు ప్రతిఒక్కరు మొక్కలు నాటాలంటూ కోరారు.కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో #Giftasmile సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అవుతోంది. కేటీఆర్ పుట్టిన రోజున మనం ‘ఒకరికి సాయం చేద్దాం..మరొకరి చేత సాయం చేయిద్దాం..’అంటూ క్యాంపెయిన్ చేపట్టారు ఫ్యాన్స్.ఇక తెరాస ఎంపీ సంతోష్‌కుమార్‌ కార్యాధ్యక్షుడు కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటున్నట్టు ఆ పార్టీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రకటించారు. ఎంపీ నిధులతో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టుగా మార్చి హైదరాబాద్ వాసులకు గిఫ్ట్‌గా ఇస్తానని ఆయన ప్రకటించారు . ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. అటవీ ప్రాంతాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలంటూ పలువురిని ఆయన పెట్టిన పోస్ట్ కు ట్యాగ్ చేశారు. కేటీఆర్‌, కవిత, దర్శకుడు పైడిపల్లి వంశీ, నటులు దేవరకొండ విజయ్‌, నితిన్‌, పారిశ్రామికవేత్త ముత్తా గోపాల్‌ను ట్యాగ్‌ చేసిన ఆయన కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంపై స్పందిస్తూ తన దత్తత నిర్ణయాన్ని ప్రకటించారు..

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos