అభిమాని తీరుకు బాధపడ్డ కేటీఆర్..

తనదైన శైలిలో రాజకీయ చతురత,వాక్చాతుర్యంతో తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెరాస కార్యాధ్యక్షుడు,మంత్రి కేటీఆర్‌ ఓ అభిమాని చేసిన పనికి బాగా హర్టయ్యారు. trsv విభాగానికి చెందిన కార్యకర్త రవికిరణ్ అనే యువకుడు వైపు పై కేటీఆర్ ఫోటో ..దానిపై డైనమిక్ లీడర్ .. ఫోటో కింద జై రామన్న అనే అక్షరాలని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. తరువాత అభిమాని ట్యాటూ ని tiwtter లో కేటీఆర్ కి ట్యాగ్ చేసాడు. ట్విట్టర్ లో ఫోటో చుసిన కేటీఆర్ ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. ఇది నిజమేనా ..? సారీ తమ్ముడూ ఇలాంటి వాటిని నేను అంగీకరించను సపోర్ట్ చేయను ఇది ఆరోగ్యానికి హానికరం ..బాధపెట్టే విషయం అంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే మరికొంతమంది అభిమానులు మాత్రం జై రామన్న అంటూ ట్విట్టర్ లో పోస్ట్ రీ పోస్ట్ చేస్తూఆనంద పడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos