ఢిల్లీ చెప్పులు మోసే గులాములు

హైదరాబాదు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక్కడి ఉజ్జయిని అమ్మవారి దర్శనానంతరం దేవాలయం వెలుపల ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు అందించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడ్ని తెలంగాణ గమనిస్తోందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి కొట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్గం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బండి సంజయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. పదవుల కోసం మరీ ఇంతగా దిగజారాలా? అని ప్రశ్నించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos