సీత పాత్రలో ఆ హీరోయినా ?

  • In Film
  • October 17, 2020
  • 24 Views
సీత పాత్రలో ఆ హీరోయినా ?

రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన అభిమానులకు ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా తమ చిత్రాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు లేదా పోస్టర్స్ విడుదల చేసేందుకు మూడు చిత్రాలకు సంబంధించిన దర్శకులు, చిత్ర నిర్మాణ సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించబోయే హీరోయిన్ ఎవరనే ప్రశ్న కేవలం ప్రభాస్ ఫ్యాన్స్‌లోనే కాదు.. ఆదిపురుష్ మూవీతో మరో దృశ్య కావ్యాన్ని ఎంజాయ్ చేయవచ్చని భావిస్తున్న ఆడియెన్స్ అందరిలోనూ ఉంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించబోయే హీరోయిన్ వివరాలు వెల్లడించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం.కీర్తి సురేశ్ నటిస్తుందని, కాదు, అనుష్క శర్మ నటిస్తుందని, అంతలోనే కైరా అద్వానీ అంటూ ఇప్పటికే కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. వాటిలో ఏమాత్రం నిజం లేదని చిత్రం యూనిట్ ఖండించింది.ఈ క్రమంలో తాజాగా సీత పాత్రకు బాలీవుడ్ నటి కృతి సనన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆమె పేరును దర్శక నిర్మాతలు ప్రస్తుతం సీరియస్ గా పరిశీలిస్తున్నారని బాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. ప్రభాస్ పక్కన కృతి అయితే పర్సనాలిటీ పరంగా కూడా సరిపోతుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో క్లారిటీ వస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos