ఎం పీ నవనీత్ కౌర్ రానా పదవికి గండం

ఎం పీ నవనీత్ కౌర్ రానా  పదవికి గండం

ముంబై: సినీ నటి, అమరావతి లోక్సభ సభ్యులు నవనీత్ కౌర్ రానా (ఎన్సీపీ) పదవికి గండం ఏర్పడింది. తాను ఎస్సీ అని తప్పుడు కుల పత్రాల్ని ఎన్నికల నామపత్రంతో జతచేయటమే దీనికి కారణం. ఆమె ఎస్సీ కులానికి చెందిన వారు కాదని కోర్టులో నిరూపితమైంది. బాంబే హైకోర్టు ఆమె కుల ద్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. దీంతో ఆమె పదవిని కూడా కోల్పోనుంది. నవనీత్ కౌర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. లబానా అనే కులానికి చెందిన వ్యక్తి. ఇది ఎస్సీ జాబితాలో లేదు. నకిలీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసారని కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసులచే దర్యాప్తు చేయించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos