ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మి నామినేషన్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మి నామినేషన్

నల్గొండ : మహిళలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో అడుగిడుతున్నానని స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి లక్ష్మి తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు వెంటరాగా సోమవారం ఆమె నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ సీనియర్‌ నాయకుల సూచన మేరకు ఎన్నికల బరిలోకి దిగుతున్నానని తెలిపారు. మంచి మెజారిటీతో విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిమానం తమ కుటుంబానికి ఉందని, కోమటిరెడ్డి బ్రదర్స్‌ అంటే ఏమిటో ఎన్నో సార్లు నిరూపించుకున్నారని చెప్పారు. తన భర్త రాజగోపాల రెడ్డికి తోడుగా ఉంటూ ప్రజా సేవ చేస్తానని వెల్లడించారు. స్థానిక సంస్థల ప్రతినిధులు తనను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos