‘ శవాల మీద చిల్లర ఏరుకునే నాయకుడు చంద్రబాబు’

‘ శవాల మీద చిల్లర ఏరుకునే నాయకుడు చంద్రబాబు’

అమరావతి : శవాల మీద చిల్లర ఏరుకునే నాయకుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ ఆయన భార్య పేరును వాడుకుంటే నందమూరి కుటుంబం మద్దతిస్తుందని చంద్రబాబు కుట్ర పన్నారు. శాసనసభలోగానీ, , బయటగానీ ఆమె పేరును మేము ప్రస్తావించలేదు. చంద్రబాబు తన భార్యను తానే అల్లరి చేసుకుంటున్నారు. నేను అనని మాటలకు ఎందుకు క్షమాపణ చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తాడు. ఆయన చెబితే మేమెందుకు వింటాం. నందమూరి కుటుంబమంటే సీఎం జగన్ కూ గౌరవమే. నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్నట్టు.. నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబును నమ్ముతున్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉంటే పార్టీ నాశనమవుతుందని నాడు చంద్రబాబు చెబితే నమ్మేశార’ని గుర్తు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos