జపానుపై గురి పెట్టిన కిమ్‌

జపానుపై గురి పెట్టిన కిమ్‌

ప్యాంగ్యాంగ్: జపాన్ లక్ష్యంగా అధునాతన ‘లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్’ను ఉత్తర కొరియా పరీక్షించినట్లు నార్త్ కొరియా న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) సోమవారం వెల్లడిం చింది. గత వారాంతంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో, క్షిపణులు 1500 కిలోమీటర్లు (930 మైళ్లు) దూరం ప్రయాణించింది. తక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్రూయిజ్ క్షిప ణులను రాడార్లు గుర్తించడం కష్టం. 1500 కి.మీ పరిధి అంటే అది జపాన్లో చాలా భాగం వరకు తన ఆధీనంలో ఉంచుకోగలుగుతుంది. ఈ క్షిపణులను వ్యూహాత్మకమైనవిగా మీడియా వర్ణిస్తోంది. ఇందులో న్యూక్లియర్ వార్ హెడ్లను అమర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ‘దేశ భద్రతలో ప్రజలకు మరింత విశ్వసనీయమైన హామీని ఇవ్వడానికి, శత్రు సైన్యాల విన్యాసాలను బలంగా అడ్డుకోవడానికి మరొక సమర్థమంతమైన ఆయుధాన్ని కలిగి ఉండాలన్న వ్యూహానికి ఈ క్షిపణుల పరీక్షలు’ అద్దం పడుతున్నాయని కేసీ ఎన్ఏ పేర్కొంది. అంతర్జాతీయ సమాజంపై ఆధిపత్యం కొనసాగించడానికి ఉత్తర కొరియా చేస్తోన్న ప్రయత్నంగా అమెరికా వ్యాఖ్యానించింది. రెచ్చగొట్టే చర్యగా కొందరు దీన్ని పరిగణిస్తున్నారు. కానీ దక్షిణ కొరియా అంత తీవ్రంగా చూడటం లేదు. ఉత్తర కొరియాలో కూడా ఇది పతాక శీర్షికలకు ఎక్కలేదు. తక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్రూయిజ్ క్షిపణులను రాడార్లు గుర్తించడం కష్టం. 1500 కి.మీ పరిధి అంటే అది జపాన్లో చాలా భాగం వరకు తన ఆధీనంలో ఉంచుకోగలుగుతుంది. ఈ క్షిపణులను వ్యూహాత్మ కమై నవిగా మీడియా వర్ణిస్తోంది. ఇందులో న్యూక్లియర్ వార్ హెడ్లను అమర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos