కిడ్నాపర్ల ఆటకట్టించిన తాలిబన్లు

కిడ్నాపర్ల ఆటకట్టించిన తాలిబన్లు

కాబూల్ : అరాచకాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని తాలిబన్లు తేల్చి చెప్పారు. బాల్ఖ్ ప్రావిన్స్, మజారే షరీఫ్ నగరంలో చిన్నారులను అపహరించిన ముఠా అంతు చూశారు. అపహరణకు గురైన ఆరుగురు చిన్నారుల్లో నలుగురిని కాపాడారు. ఇద్దరు చిన్నారులను కిడ్నాపర్లు బలిగొన్నారు. ఆదివారం రాత్రి జరిగిన భీకర పోరులో ఐదుగురు కిడ్నాపర్లను తాలిబన్లు మట్టుబెట్టారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని సమాచార, సాంస్కృతిక విభాగం అధిపతి జబీహుల్లా నౌరాని వెల్లడించారు. ఒక తాలిబన్కి గాయాలయ్యాయని తెలిపారు.

తాజా సమాచారం