అది సన్నాసులు రాద్ధాంతం

అది సన్నాసులు రాద్ధాంతం

శ్రీకాకుళం: ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యా బోధన గురించి కొందరు సన్నాసులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాజాం మండలం పొగిరిలోగురువారం మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రసంగించారు. ‘విపక్ష నేతలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించి పేదల విషయంలో మాత్రం నీతులు చెబుతు న్నారు. ఎర్రన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఇంగ్లీష్ వచ్చినందునే ఢిల్లీ వెళ్లారు. . అచ్చెన్నాయుడుకు ఇంగ్లీష్ రాక పోవటంతో విజయవాడలో తిరుగుతున్నారు. అచ్చెన్నాయుడుని చూస్తే మాత్రం అందరికీ భయం. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంగ్లీష్కే ప్రాధాన్యం ఉంది. చంద్రబాబు పార్థనర్ పవన్ మా ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. చంద్రబాబు గండిపేటలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ స్కూల్ ఏ మీడియం? పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు?, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదా?’ని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ‘నేటి పిల్లలకు ముఖ్యమంత్రి జగన్ మేనమామ. త్వరలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తాం. రాష్ట్రంలో 45 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.33 వేల కోట్లు కేటాయించాం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos