ఎమర్జెన్సీపై ఎంతకాలం మాట్లాడుతూ పాలన సాగిస్తారు

ఎమర్జెన్సీపై ఎంతకాలం మాట్లాడుతూ పాలన సాగిస్తారు

న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ చీకటి పాలనపై చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఎంతకాలం కాషాయ పాలకులు పాలన సాగించాలని కోరుకుంటున్నారని ఖర్గే నిలదీశారు. మీరు దీనిపై 100 సార్లు మాట్లాడతారు..ఎమర్జెన్సీ విధించకుండానే మీరు ఇదంతా చేస్తున్నారు..ఇలా మాట్లాడుతూ ఎంతకాలం పాలించాలని మీరు కోరుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు, అందుకే సోమవారం అన్ని పార్టీల నాయకులు ముందుకొచ్చి నిరసన చేపడుతున్నారని అన్నారు. కాషాయ పాలకులు అన్ని ప్రజాస్వామ్య నియమ, నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తాము మోదీని కోరుతున్నామని ఖర్గే చెప్పారు. నినాదాలు కాదని, విషయం ప్రధానమని విపక్షాలకు మోదీ చెబుతున్నారని, కానీ వాదన కాదు, ఏకాభిప్రాయం ముఖ్యమని విపక్ష ఇండియా కూటమి ఆయనకు చెబుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos