మీ వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం : పీఎంకు కేసీఆర్ లేఖ

మీ వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం : పీఎంకు కేసీఆర్ లేఖ

ఐఏఎస్ కేడర్ రూల్స్ 1954 మార్పు.. డిప్యూటేషన్‌ రూల్స్‌ ప్రతిపాదించిన కేంద్రం తీరుపై పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఓ లేఖరాశారు.

ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణపై లేఖలో అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాల్లో పని చేసే అధికారులను కేంద్రం పరోక్షంగా నియంత్రించే ఎత్తుగడగా లేఖలో అభివర్ణించారు.  నిబంధనలను సవరించడం వల్ల రాష్ట్ర పరిపాలన చిక్కుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఈ సవరణలు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్న సీఎం కేసీఆర్‌..  ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. చిరవగా..  తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని లేఖలో సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు.

ఐఏఎస్ కేడర్ రూల్స్ 1954ను మార్చాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని పలువురు ముఖ్యమంత్రులు ఇదివరకే డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్విటర్‌ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేయగా.  ఐఏఎస్ డిప్యూటేషన్ విషయంలో కేంద్రం ప్రతిపాదించిన మార్పులు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ  తదితరులు ఇప్పటికే ప్రధానికి లేఖలు రాశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos